రామడుగు, ( పిసి డబ్ల్యూ న్యూస్) రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామంలో 146సర్వేనెంబర్ లో నాలుగు ఎకరాల 22 గుంటలు గత 41 ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన దళిత కుటుంబాలకు ఇండ్ల స్థలాల కోసంఅప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.. కాలక్రమమైన దళిత కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఇబ్బంది వల్ల ఇండ్ల నిర్మాణం ఆగిపోవడం వల్ల మండల మాజీ ప్రజా ప్రతినిధులు ఈ భూమిని కబ్జా చేసుకున్నారని దళితులు ఆరోపిస్తూ వస్తున్నారు.. ఈ భూమిని పరిరక్షించి మళ్లీ దళిత కుటుంబాలకు స్వాధీన పరచాలని గత కొన్ని ఏళ్లుగా ప్రభుత్వానికి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేశారు. అయినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం. కాగా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలనలో ఈ సమస్యను పరిష్కరించాలని దళిత కుటుంబాలు పెద్ద మనుషులు గ్రామానికి చెందిన డి ఎస్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కనకం వంశీ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసి గత 18 నెలల నుండి పోరాటాన్ని విస్తృతం చేశారు.. ఈ క్రమంలో ఆర్డీవో మహేశ్వర్ ఆదేశాల మేరకు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే బృందంసభ్యులు ముయిజ్ కర్ణాకర్ మనోజ్ రెండు దఫాలుగా సర్వే చేపట్టి భూ సమస్యను హద్దులు చూపిసమస్యను పరిష్కరించారు. దీంతో దళిత కుటుంబాలు అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిహర్షం వ్యక్తం చేశారు.. గత 41 ఏళ్లుగా పరిష్కారం కానీ ఈ సమస్యను కొద్ది నెలల్లో కనకం వంశీ ప్రత్యేక చొరవతోసమస్యను పరిష్కరించినందుకు ఆయనను గ్రామస్తులు అభినందిస్తున్నారు.