మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఈ సి ఐ ఎల్, కమలానగర్ లోని సి ఐ టి యు ఆఫీస్ నందు సుప్రీం కోర్టు వాక్యాలను బలపర్చుతు ప్రజా క్షేమం కోరుతు సమావేశం జరిగింది,ఈ సమావేశానికి యువ నాయకుడు ఏపూరి గిరీష్ అధ్యక్షత వహించారు. స్ఫూర్తి గ్రూపు నాయకులు గొడుగు యాదగిరిరావు మాట్లాడుతు నేడు రహదారుల పైన, ఫుట్పాత్ లపైన గాని, అభివృద్ధి పనులలో ఆటంకాలుగా అనేక నిర్మాణాలు ఉండి ప్రజల ప్రయాణాలకు ఆటంకం కలిగించడమే కాకుండా వారి ప్రాణాలను కూడా బలి తీసుకుంటున్నాయి. పెద్ద పెద్ద రహదారులు కూడా రోడ్డుకు అడ్డంగా పెద్ద పెద్ద నిర్మాణాలతో మతాల చిహ్నాలు, నిర్మాణాలు ఉండి చాలా ఇబ్బందులు కలిగిస్తున్నాయి. సుప్రీంకోర్టు చెప్పిన విధంగా అటువంటి నిర్మాణాలను ప్రత్యామ్నాయ ప్రదేశాలకు తరలించి, ప్రజలకు మేలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకి ఉందని అన్నారు. అటువంటి తరలింపు బాధ్యత పూర్తిగా ప్రభుత్వాలకు ఉందని అటువంటి వాటిని గుర్తించి అభ్యుదయవాదులు, పీడితులు అందరూ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి ఆ విధంగా కృషి జరిగే విధంగా చూడాలని చెప్పారు. కర్రె మల్లేశం, కోమటి రవి, పి.బి చారి, ఏఆర్ వి ప్రసాద్ లు మాట్లాడుతు ఇటువంటి ఆలోచన సరైందని, దానికోసం మన కర్తవ్యం గా ప్రజల్లో చైతన్యం కల్పించి ప్రజల ద్వారా సమస్య లను ప్రభుత్వానికి తెలియజేసి సుప్రీంకోర్టు డైరెక్షన్లో పాటించే విధంగా కృషి చేయాలనీ కోరారు. అనంతరం “అభివృద్ధికి ఆటంకం కలిగించే నిర్మాణాలను తరలించే కృషికి (సిటిజన్ రైట్స్ అసోసియేషన్ )కమిటీ” ఏర్పాటు చేయటం జరిగింది. అధ్యక్షులు మన్నే ప్రశాంత్,ఉపాధ్యక్షులు పాడుగుల చంద్రమౌళి, వై సౌమ్య , ప్రధాన కార్యదర్శి ఏపూరి గిరీష్, సహాయ కార్యదర్శులుగా చంద్రశేఖర్,వినాయక్,ఆర్గనైజ్ సెక్రటరీ నర్సింగరావు ల తో కమిటీని ఎన్నుకున్నారు.అనుభవజ్ఞులు అయిన గొడుగు యాదగిరి రావు, కర్రె మల్లేశం, పి.బి.చారి, కోమటి రవి గార్ల సలహాలు సూచనలు తీసుకోని ముందుకు నడవాలని భావించారు. అక్టోబర్ మాసంలోనే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో సదస్సు ఏర్పాటు చేసి ప్రజలతో సంతకాల సేకరణ అలాగే అన్ని జిల్లాల కలెక్టర్లకు మరియు ఉన్నత అధికారులకు మెమొరండాలు ఇచ్చి సమస్య లను తెలిపాలని అన్నారు, నిరంతరం ప్రజల్లో అవేర్నెస్ కల్పించడం కోసం కృషి చేయాలనీ అన్నారు.