హనుమకొండ ప్రతినిధి: (పిసి డబ్ల్యూ న్యూస్) సింగపూర్ లో జరిగిన 10th FKK ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో మన భారత జట్టు రజత పతకం గెలుచుకున్నారు.టీమ్ ఈవెంట్ ఫైనల్స్ లో మలేసియా తో పోరాడి 3-2 తో ఓడిపోయి భారత్ ద్వితీయ స్థానం లో నిలిచింది. ఈ టోర్నీలో చాలా మంది ఒలింపిక్స్ ఆడిన వివిధ దేశాల క్రీడాకారులు పాల్గొన్నారు. భారత్ తరపున మన హైదరాబాద్ నుండి ముప్పాల వేణు గోపాల్, లింగేశ్వర్, లక్ష్మీ నారాయణ రయ్య, UVN బాబు, జితేందర్ రెడ్డి, నంద గోపాల్ కిదాంబి, డాక్టర్ రవి కిరణ్, జ్ఞాన ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. విద్యాధర్ మన జట్టు కి కెప్టెన్ గా ఉండి మన జట్టుని ముందుకు నడిపించారు. హైదరాబాద్ చేరుకున్న మన భారత టీం అందరిని మ్యాచ్ పాయింట్ బ్యాడ్మింటన్ అకాడెమీ సభ్యులు క్రీడాకారులు అభినందించారు. ఈ సందర్భంగా మ్యాచ్ పాయింట్ చైర్మన్ వేణు ముప్పాల మాట్లాడుతూ.. ఫు కాక్ కియాంగ్ ,తౌఫిక్ హిదాయత్ ,బోన్సాక్ మరియు బ్రెయిస్ లాంటి దిగ్గజాలతో కలిసి ఆడటం వల్ల ఎంతో తెలుసుకున్నాం అని చెప్పారు.