Thursday, April 3, 2025

పెండింగ్ డి ఏ లను వెంటనే విడుదల చేయాలి..

స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్, తెలంగాణ కాశీబుగ్గ యూనిట్ డిమాండ్..

పెన్షనర్ల కు హక్కుగా రావలసిన పెండింగ్ డీఏలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు తుమ్మ వీరయ్య, ఉపాధ్యక్షులు వెలిశోజు రామ మనోహర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్, తెలంగాణ (ఎస్ జి పి ఏ టి) కాశిబుగ్గ యూనిట్ సమావేశం ఆదివారం తుమ్మ వీరయ్య అధ్యక్షతన స్థానిక శిశుమందిర్ పాఠశాలలో జరిగినది. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు వెలిశోజు రామ మనోహర్,రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ యస్ రాజయ్య ,వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి యన్ సదానందం, కాశిబుగ్గ, మట్వాడ బాధ్యులు ఎండి మదార్ సాహెబ్,పి రత్నం, కె డేనియల్ ,కె కుమారస్వామి, ఎ భిక్షపతి,కె పర్శరాములు, కె మధుసూదనరావులు పాల్గొనగా.., సుమారు 100 మంది పెన్షనర్లు హాజరు కావటం జరిగింది. సమావేశ అధ్యక్షులు తుమ్మ వీరయ్య సమావేశం ప్రారంభిస్తూ ” ఆదివారం పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యల తీరుతెన్నులను వివరించారు. నేటికీ పెండింగ్ డి ఆర్ లు విడుదల చేయక పోవటం , పి ఆర్ సి నీ అమలు చేయక పోవటాన్ని నిరసిస్తూ ” మాట్లాడారు. సి వి పి విషయంలో ఉన్నత న్యాయ స్థానానికి పోవటం వలన కలిగే ప్రయోజనాలు సోదాహరణంగా వివరిస్తూ మాట్లాడారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు వెలిశోజు రామ మనోహర్ తమ సందేశంలో ” పెండింగ్ సమస్యల పైన రాష్ర్ట సంఘం ఇచ్చిన ప్రాతినిధ్యాలను వివరించారు. కోర్టు కేసు కు సంబందించిన విషయాలను వివరించారు. రాష్ట్ర స్థాయిలో రెండు జె ఏ సి లు ఏర్పడినా మన సమస్యలకు పరిష్కారం దొరకని కారణాలు, సంఘటిత ఉద్యమాల ద్వారానే మన సమస్యలు సాధించుకోవాలని” కోరారు. సభ్యుల సందేహాలకు వివరణ ఇస్తూ ప్రసంగించారు. సమావేశంలో మాట్లాడిన మిత్రులు పెండింగ్ డి ఆర్ లు, పి ఆర్ సి , సి వి పి మినహాయింపు 12 సం.లకు నిలుపుదల చేయటం తదితర అంశాలను ప్రస్తావిస్తూ మాట్లాడారు. బ్లూ చిప్ హనుమకొండ మేనేజర్ లింగాల రఘుపతి ఇన్కమ్ టాక్స్ విషయాల పైన అవగాహన కల్పించారు. ఇటీవల వస్తున్న కొన్ని నోటీసు లకు సంబంధించి వివరించారు. చివరగా ఎండి మదార్ సాహెబ్ వందన సమర్పణతో సమావేశం ముగిసింది.

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles