మహబూబాబాద్/మరిపెడ (పి సి డబ్ల్యూ న్యూస్ ప్రతినిధి) : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నూకల నరేష్ రెడ్డి మృతదేహాన్ని చూసి ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి కన్నీటి పర్యంతం అయ్యారు. స్వయానా బావమరిది కావడంతో ఆయన మృతిని తట్టుకోలేక పోయారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెంలో నరేష్ రెడ్డి మృతదేహానికి ఎంపీ నివాళులు అర్పించారు. ఆర్ఆర్ఆర్ తో పాటు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ బాబు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్ తదితరులు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. నరేష్ రెడ్డి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవున్ని ప్రార్థించారు.