స్కూలు బిల్డింగ్ ఖాళీ చేయాలని వారసులు కానీ వ్యక్తుల జులుం..
కరీంనగర్ జిల్లా అక్టోబర్ 05(పిసి డబ్ల్యూ న్యూస్): నగరంలోని కోట్ల శేఖాన్, సవారన్ స్ట్రీట్ ప్రాంతంలోని కేకే హాస్పిటల్ ముందు వీధిలోని ఇటీవలి కాలంలో మూతపడిన మెల్ రోజ్ స్కూల్ బిల్డింగ్ ను తాము లీజుకు తీసుకొని నడిపిస్తున్నామని, ఇటీవలే సదరు భవన యజమాని అకాల మరణం చెందడంతో తక్షణమే భవనాన్ని ఖాళీ చేయాలని కొంతమంది వచ్చి తమపై దాష్టీకాన్ని ప్రదర్శించి బెదిరింపులకు పాల్పడుతూ.. తాము లీదుకు తీసుకున్న భవనంలో అక్రమంగా ప్రవేశించి నిర్మాణాలను ధ్వంసం చేసిన నవాబ్ స్కూల్ యజమానులు ఫసియుద్దీన్, మిన్ హజ్, రజియుల్లా ఖురేషి అనే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, స్కూల్ పిల్లల భవిష్యత్తును కాపాడాలని హుదా స్కూల్ చైర్మన్ అహ్మద్ అబ్దుల్ అజీమ్, జిల్లా పోలీసు కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పోలీసు కమిషనర్ కు టౌన్ ఏసీపీ, టూటౌన్ సిఐలకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ మెల్ రోజ్ స్కూల్ బిల్డింగ్ యజమాని అయిన ఇఫ్ఫత్ యాస్మిన్ తో, సాక్షుల సమక్షంలో రాబోయే (15) సంవత్సరాల లీజు అగ్రిమెంట్ ను చేసుకొని, తాము గత ఐదు నెలల నుంచి అట్టి భవన ఆధునికరణ కోసం సుమారు (50)లక్షల రూపాయలను ఖర్చు చేసి నిర్మాణ పనులు చేపట్టామన్నారు. బిల్డింగ్ ఓనర్ ఇఫ్ఫత్ యాస్మిన్ కంటే భర్త చనిపోయి ఉండటంతో, వీరికి ఎవరు సంతానంఎవరూ లేకపోవడంతో, ఆమె ఆరోగ్యం క్షీణించి సహకరించకపోవడంతో స్కూల్ బిల్డింగును అద్దెకు తీసుకోవాలని మమ్మల్ని సంప్రదించారని పేర్కొన్నారు. వీరి బాగోగులు చూస్తున్న సమీర్ అనే వ్యక్తి సాక్షిగా పెట్టి, అగ్రిమెంట్ లీజు ను మార్చి నెలలో చేశారని, అధికారికంగా ఏప్రిల్ నెలలో లీజు అగ్రిమెంట్ ను సాక్షుల సమక్షంలో చేసుకున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ (7)వ తేదీన రాత్రి మా బిల్డింగ్ ఓనర్ అయిన ఇఫత్ యాస్మిన్ అకాల మరణం చెందడంతో, కొందరు బంధువులుగా చలామణి అవుతున్న మరొక ప్రైవేట్ స్కూల్ నడుపుతున్న వ్యక్తులు మధ్యలో వచ్చి బిల్డింగ్ ఓనర్ చనిపోయారని, ఆమె మాకు బంధువుతుందని బుకాయిస్తూ, తక్షణమే స్కూల్ బిల్డింగ్ను ఖాళీ చేయాలని, మేము నిర్మించిన ర్యాంపును, దొంగ చాటున రాత్రి వేళలో వచ్చి ధ్వంసం చేశారన్నారు. మమ్మల్ని బెదిరింపులకు పాల్పడుతూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ దౌర్జన్యానికి దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పాఠశాలలో (800) మంది స్కూల్ పిల్లలు నర్సరీ నుండి పదవ తరగతి వరకు చదువుతున్నారని, వారందరి భవిష్యత్తు అగమ్య గోచరంగా మారే ప్రమాదం ఉందని, ప్రైవేటు టీచర్లు సైతం రోడ్డున పడతారని, తాము సుమారు 50లక్షల వరకు ఖర్చు చేసి భవనాన్ని ఆధునికరించామని, తమ వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని, చెప్పినప్పటికీ ఫసియోద్దీన్ నవాబ్, మిన్ హాజ్, రజీవుల్ల ఖురేషిలకు చెప్పినా వినిపించుకోలేదన్నారు. తమపై దురుసుగా మాట్లాడుతూ జులుం చేస్తున్నారని ఆరోపించారు. మా బిల్డింగ్ ఓనర్ బ్రతికి ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు బంధువులుగా చలామణి అవుతూ వస్తున్న వీరు, ఏ ఒక్కరోజు కనిపించలేదని, వీరి గురించి తమ బిల్డింగ్ ఓనర్ తమకు ఎప్పుడూ వాకబు చేయలేదని, అయినప్పటికీ వారి వారసులు ఎవరైనా ఉంటే భవనాన్ని తీసుకోవడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ మా లీజు అగ్రిమెంట్, మా స్కూల్ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని లీజు అగ్రిమెంట్ ను కొనసాగించమని ప్రాధేయపడిన వినకుండా దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ కూలీలను భయభ్రాంతులకు గురి చేస్తూ చంపుతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. దీనిపై పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశామని వీరందరిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని తమ స్కూల్ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మా స్కూల్ పిల్లలకు తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో హుదా స్కూల్ బోర్డు డైరెక్టర్స్ అబ్దుల్ రబ్ ముజాహిద్ లతీఫి, ఖాలీద్ లతీఫి తదితరులు పాల్గొన్నారు.