కరీంనగర్ జిల్లా అక్టోబర్ (పిసి డబ్ల్యూ న్యూస్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షనర్ల కు ఇవ్వవలసిన (5) డి ఏ లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంత కుమారి లకు తెలంగాణ ఉద్యోగుల గజిటెడ్ అధికారుల ఉపాధ్యాయుల కార్మికుల మరియు పెన్షన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ శనివారం రోజు పత్రిక విలేకరుల సమావేశంలో మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వవలసిన డి ఏ లు పెండింగ్ ఉండటం తెలంగాణ రాష్ట్రంలో నూతనముగా గత సంవత్సరము కితం ఏర్పాటు అయిన కాంగ్రెస్ ఐ పార్టీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడైనా విజయదశమి దసరా పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వవలసిన డి ఎ లను వెంటనే విజయదశమి పండుగ కానుకగా ఇవ్వాలని తెలంగాణ ఉద్యోగుల గెజిటెడ్ అధికారుల ఉపాధ్యాయుల కార్మికుల మరియు పెన్షనర్ల ఎగ్జిక్యూటివ్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంత కుమారి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క లకు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పకుండా విజయదశమి పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు కానుకగా డి ఎ లను తప్పకుండా ఇస్తారని ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన కొరకు ఎదురుచూస్తున్నారు అని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఈ సందర్భంగా తెలిపారు ఎందుకంటే చిన్నచిన్న ఉద్యోగులు వారి కుటుంబాలకు విజయదశమి పండుగ సందర్భంగా కొత్త బట్టలు తమ కుటుంబ సభ్యులకు పండుగకు వచ్చే బంధువులకు కొనవలసి ఉంటుంది దసరా పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరి కుటుంబంలో ఎన్నో ఖర్చులు ఉంటాయి కనుక ఈ సందర్భంగా మన తెలంగాణ డైనమిక్ టైగర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంత కుమారి చొరవ తీసుకొని ప్రభుత్వం ఉద్యోగులకు మంజూరు చేయవలసిన డి ఏ లను వెంటనే ఇస్తారని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు.