మోషన్ కాలేజీలో బతుకమ్మ పండుగ వేడుకలు..
హనుమకొండ ప్రతినిధి: (పి సి డబ్ల్యూ న్యూస్) : హన్మకొండ నయీమ్ నగర్ లోని మోషన్ జూనియర్ కాలేజీలో ఈ రోజు బతుకమ్మ వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగినవి. ఈ సందర్బంగా కాలేజీ చైర్మన్ వడ్లకోండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ.. బతుకమ్మ లో సంగీతం, సాహిత్యం, ఆటపాటలతో పాటు తెలంగాణ జీవన విధానం ఇమిడి ఉంటుందని అన్నారు. బతుకమ్మలో అనేక రంగు రంగుల పూలు, మనలోని ఐక్యతకు నిదర్శనం అని అన్నారు. ప్రపంచంలో ఎక్కడ లేని విదంగా బతుకమ్మ జానపద సంస్కృతి తెలంగాణలో మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను అంతరించపోకుండా కాపాడవాల్సిన బాధ్యత మన అందరిది అని అన్నారు. ఈ కార్యక్రమంలో మోషన్ కాలేజీ ప్రిన్సిపాల్ ముత్యాల సురేష్, కాలేజీ సిబ్బంది తాళ్లపెల్లి రమేష్ గౌడ్, అరుణ, శిల్ప, మమత, అరుణ్, కొడారి అనిల్, తదితరులు పాల్గొన్నారు.