Thursday, April 3, 2025

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూఢనమ్మకాల నిర్మూలన చట్టాన్ని వెంటనే తీసుకురావాలి..

నవంబర్  పిసి డబ్ల్యూ న్యూస్:  మంత్రాల పేరుతో చేతబడుల పేరుతో భౌతిక దాడులు చేసి హత్యలు జరుగుతున్నాయని వీటిని నిర్మూలించాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మూఢనమ్మకాల నిర్మూలన చట్టాన్ని తీసుకురావాలని సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ నేషనల్ కోఆర్డినేటర్ చార్వాక అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియా లలో గురువారం రాత్రి ద్యాగల ముత్తవ్వ(45) కుటుంబం వ్యవ సాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆమె మంత్రాలు చేసి చేత బడి చేయడంతోనే తాము తరచూ అనారోగ్యానికి గురవుతున్నామని నమ్మి ఆమె ఇంటికి సమీపంలో ఉంటున్న వారి బంధువులు అనుమానించి, గురువారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్న ఆమెపై దాడిచేసి తీవ్రంగా కొట్టి అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించారు. కుటుంబ సభ్యులు కాపాడేందుకు ప్రయత్నించగా ఆమె కొడుకు పైన కూడా దాడి చేశారు. ఆమె కొడుకు సంఘటనా స్థలం నుండి స్థానిక పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆమెను ఆసుపత్రికి తరలించే క్రమంలోనే మృతి చెందింది. శాస్త్ర పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందుతున్న నేటి తరుణంలో ఇప్పటికి మంత్రాలు చేస్తున్నారని చేతబడి చేస్తున్నారని భౌతికంగా దాడులు చేసి హత్యలు చేసే పరిస్థితి సమాజంలో ఉందన్నారు. ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం కల్పించడం ప్రశ్నించే తత్వాన్ని అలవర్చడం ప్రభుత్వాల బాధ్యత అని అన్నారు. విద్యార్థి దశ నుండే మూఢనమ్మకాల నిర్మూలనకు కృషి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉందన్నారు. విద్యార్థి దశలోనే ప్రశ్నించే తత్వాన్ని అలవరచడం ద్వారా విజ్ఞానవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మూఢనమ్మకాల నిర్మూలన చట్టాన్ని తీసుకువచ్చి పట్టణాల్లో మరియు గ్రామాల్లో మూఢనమ్మకాల నిర్మూలన సభలు నిర్వహించి శాస్త్రీయ సమసమాజ నిర్మాణానికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పెండ్యాల సుమన్, ఎస్ ఎస్ ఎఫ్ సభ్యులు సుజాత మరియు రాకేష్ పాల్గొన్నారు.
ఉద్యమాభివందనాలతో…పెండ్యాల సుమన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (SSF),తెలంగాణ రాష్ట్రం.

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles