Tuesday, July 21, 2026

సజీవ దహనమైన సాయి కుమార్ కుటుంబాన్ని ఆదుకుంటా..

కరీంనగర్ జిల్లా  (పిసి డబ్ల్యూ న్యూస్) : మానకొండూర్ మండలం ఈదుల గట్టెపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఇంటిలో సజీవ దహనమైన అంగడి సాయి కుమార్ అనే ఏడేళ్ల బాలుడి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటానని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చెప్పారు. శనివారం ఉదయం కరీంనగర్ లోని జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో పోస్టు మార్టం కోసం మార్చరీలో భద్రపర్చిన సాయి కుమార్ మృతదేహాన్ని చూసి ఆయన చలించిపోయారు. అనంతరం ఆయన సాయి కుమార్ సజీవ దహనానికి గల కారణాల గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భోరున విలపిస్తున్న సాయి కుమార్ తల్లిదండ్రులు అనిత, రాజ్ కుమార్ లను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఓదార్చారు. యాదృచ్చికంగా జరిగిన అగ్ని ప్రమాదంలో సాయి కుమార్ సజీవ దహనం కావడం అత్యంత విషాదకరమని ఆయన పేర్కొన్నారు. సాయికుమార్ కుటుంబానికి అండగా వెన్నంటి ఉంటానని, ప్రభుత్వ పరంగా చేయూతనందిం చేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి మీస సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ ఈదుల గట్టెపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు చిలగాని సదయ్య తదితరులు ఉన్నారు.

Related Articles

Latest Articles