పెద్దపల్లి, (పిసిడబ్ల్యూ న్యూస్) : డీఎస్సీ పరీక్షలు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ రెండు రోజులలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపల్లి పట్టణంలోని ఎంపీడీవో ప్రాంగణంలోనే ఎం.ఆర్.సి కేంద్రంలో డీఎస్సీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, మన జిల్లాలో 93 పోస్టులకు గాను 1:3 రేషియో క్రింద ఎంపిక చేసిన 202 డీఎస్సీ అభ్యర్థుల వెరిఫికేషన్ కోసం 6 కౌంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. డీఎస్సీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం 1:3 రేషియోలో అభ్యర్థులను ఎంపిక చేసిందని, పెద్దపల్లి జిల్లా పరిధిలో 202 మంది అభ్యర్థులు ఎంపిక అయ్యారని , ఇప్పటి 177 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయిందని, మిగిలిన 25 అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అక్టోబర్ 5 వరకు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ తనిఖీల్లో జిల్లా విద్యాశాఖ అధికారి డి.మాధవి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
–
అక్టోబర్ 5 వరకు డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి-జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష..
