Thursday, April 3, 2025

డాక్టర్ ఏ ఎస్ రావు గారి డాక్యుమెంటరీ ఫిలిం ప్రదర్శణ..

కాప్రా (పి సి డబ్ల్యూ న్యూస్) రిపోర్టర్: తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్,ఏఎస్ రావు విజ్ఞాన వేదిక,విజ్ఞాన దర్శిని ల ఆధ్వర్యంలో డాక్టర్ ఏ ఎస్ రావు విజ్ఞానోత్సవాలు డాక్టర్ ఏఎస్ రావు నగర్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆవరణలో 3 10 2024 రాత్రి 7 గంటలకు డాక్టర్ ఏ ఎస్ రావు గారి డాక్యుమెంటరీ ఫిలిం ప్రదర్శించబడింది. ముఖ్యఅతిథిగా విజ్ఞాన దర్శిని వ్యవస్థాపకులు టి రమేష్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు అధ్యక్ష వహించారు. టి రమేష్ గారు మాట్లాడుతూ డాక్టర్ ఏఎస్ రావు గారు విద్య అభ్యసించడం కోసం ఎనలేని కృషి చేశారని చెప్పారు. అమెరికాలో చదువుకున్నప్పటికీ అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నా దేశభక్తియుతంగా భారతదేశానికి వచ్చి దేశ స్వావలంబన కొరకు మన కాళ్ళ మీద మనం నిలబడి ఉత్పత్తులు చేసే అందుకోసం అవిరళ కృషి చేశారని చెప్పారు. ఆయన స్వయంగా సైంటిస్ట్ గా ఉండి ఈసీఐఎల్ నిర్మాణం పరిపాలన అభివృద్ధిని చేసి వేలాది మందికి ఉద్యోగాలు లక్షలాదిమందికి ఉపాధి అవకాశాలు కోట్లాదిమందికి స్ఫూర్తివంతంగా నిలిచారని చెప్పారు. అనంతరం డాక్టర్ ఏఎస్ రావు గారు జీవిత విశేషాలు తో కూడిన డాక్యుమెంటరీ ఫిల్మ్ను ప్రదర్శించడం జరిగింది. ఏఎస్ రావు నగర్ కాలనీవాసులు సీనియర్ సిటిజన్స్ అత్యధికలు పాల్గొని డాక్టర్ ఏఎస్ రావు గారికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఏఎస్ రావు విజ్ఞాన వేదిక ఉపాధ్యక్షులు జి శివరామకృష్ణ వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ పాషా, రుక్కయ్య, బాలు, రామ్మూర్తి, పి బి చారి, ఏ ఎస్ రావు నగర్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కృష్ణమూర్తి, రామ్మోహన్రావు, మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles