Thursday, April 3, 2025

బంగారు బతుకమ్మ సంబరాలను విజయవంతం చేయండి..

కరీంనగర్ జిల్లా ప్రతినిథి (పీ సీ డబ్ల్యూ న్యూస్) ఆదివారం రోజున వైశ్య భవన్లో వైశ్య సేవా కేంద్రం మరియు జిల్లా ఆర్యవైశ్య మహాసభ సంయుక్త ఆధ్వర్యంలో సాయంకాలం నాలుగు గంటల నుండి నిర్వహిస్తున్నటువంటి బంగారు బతుకమ్మ సంబరాలకి ఆర్యవైశ్య మహిళల తో పాటు అన్నీ కులాల సోదరీమణులు అధిక సంఖ్యలో విచ్చేసి ఆటలు ,పాటలు, దాండియా ,నృత్యాలతో జరిగే సంబరాలను విజయవంతం చేయవలసిందిగా వైశ్య సేవా కేంద్రం అధ్యక్షులు చిదుర సురేష్ మరియు జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కన్న కృష్ణ ఒక ప్రకటనలో తెలియజేశారు. శుక్రవారం ప్రెస్ భవన్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో వీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మహిళకు ఒక పార్టిసిపెంట్ గిఫ్ట్ ప్రతి పావుగంటకు ఒక మారు ఒక లక్కీ ఉమెన్ గిఫ్ట్, తీసుకొచ్చిన బతుకమ్మలకు మొదటి ,ద్వితీయ , తృతీయ బహుమతులతో పాటు కన్సిలేషన్ బహుమతులు కూడా ఉంటాయని తెలియజేశారు. ముఖ్య అతిథులుగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి శ్రీ బండి సంజయ్ గారి సతీమణి శ్రీమతి బండి అపర్ణ గారు అలాగే కరీంనగర్ శాసనసభ్యులు శ్రీ గంగుల కమలాకర్ సతీమణి శ్రీమతి గంగుల రజిత కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ శ్రీమతి జి స్వరూప రాణి విచ్చేయుచున్నట్టు తెలియజేస్తూ ,ఆహ్వాన పత్రికను ఆవిష్కరిం చారు.ఈ విలేకరుల సమావేశంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నగునూరి రాజేందర్ మాట్లాడుతూ ప్రతి వాడనుండి బతుకమ్మలను అధిక సంఖ్యలో తీసుకువచ్చి విజయవంతం చేయాలని కోరారు. వైశ్య సేవ కేంద్రం కల్చరల్ అండ్ డివోషనల్ కోఆర్డినేటర్ నలుమాచు చంద్రశేఖర్ మాట్లాడుతూ మేము అడగగానే కో స్పాన్సర్ గా వ్యవహారించిన
చందా న్యూరో & ట్రామా కేర్ సెంటర్ అధినేత డాక్టర్ చందా శ్రీనివాసరావు (న్యూరో సర్జన్ )-డాక్టర్ లీలా శర్వాణి (రేడియాలజీ,) విన్నెర్స్ పబ్లికేషన్స్ అధినేత పులి ప్రసన్న హరికృష్ణ ,మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువలరీ చీఫ్ మేనేజర్ షరీఫ్ మరియు సంజయ్ అలాగే బ్రమరాంబికా షాపింగ్ మాల్ అధినేత వెంగళ రమేష్ -శ్రీదేవి లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైశ్య సేవా కేంద్రం ప్రధాన కార్యదర్శి పెద్దివిద్యాసాగర్ కోశాధికారి ముస్త్యాల రమేష్ కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి కొమురవెల్లి వెంకటేశం ,ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐ జె యు) జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎలగందుల రవి , జిల్లా ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం అధ్యక్షురాలు చకిలం స్వప్న వైశ్య సేవా కేంద్రం డైరెక్టర్లు రామిడి శ్రీధర్ , ఎల్గూరి రవి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles