పరకాల పట్టణంలోని కనకదుర్గమ్మ,మధన పోచమ్మ ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నేడు రెండవ రోజు అమ్మవారు గాయత్రి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు,ప్రజలు పాల్గొన్నారు.