Saturday, March 7, 2026

మండల నాయకులపై తప్పుడు కథనాలు రాయించడం సరికాదు.నడికూడ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్

నడికూడ, అక్టోబర్ 4 (పిసిడబ్ల్యూ న్యూస్): నడికుడ కాంగ్రెస్ మండల పార్టీ నాయకులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలు పరిష్కరించడాన్ని ఓర్వ లేని ప్రతిపక్ష నాయకులు బురదజల్లే ప్రయత్నాలు చేస్తూ పలు పత్రికలలో తప్పుడు కథనాలు రాయిస్తూ పబ్బం గడుపుతున్నారని ఖబర్దార్ ప్రతిపక్ష నాయకులారా కాంగ్రెస్ మండల పార్టీ నాయకులపై బురదజల్లే ప్రయత్నం చేసి ఇబ్బందులకు గురి చేస్తే చట్టం తన పని తాను చేసుకుంటుందని నడి కూడ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల పార్టీ నాయకులు నడి కూడ మండల కేంద్రంలో గాని మరియు 14 గ్రామాలలో గాని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలాంటి పెత్తనాలు చేస్తూ ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని పాల్పడినట్టుగా ఎవరైనా రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకోవడానికి మండల పార్టీ నాయకులు సిద్ధమని ప్రజలకు చేరువగా ఉండే దాన్ని ఓర్వలేక ప్రతిపక్ష నాయకులు బురదజల్లే రాజకీయాలు చేస్తూ తప్పుడు కథనాలు రాయిస్తూ కాంగ్రెస్ మండల నాయకుల మనోభావాలపై దిబ్బతీస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా తప్పు చేసినచో రుజువు చేస్తే దేనికైనా సిద్ధమేనని అన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తే తాట తీస్తామని హెచ్చరించారు.

Related Articles

Latest Articles