మానకొండూర్ సెప్టెంబర్ 30 (పిసీ డబ్ల్యూ న్యూస్) : మానకొండూర్ నియోజకవర్గం మానకొండూర్ బాలికల ఉన్నత పాఠశాలలో గ్రామ ఆరోగ్య పారిశుధ్య పోషణ దినోత్సవం సందర్భంగా పోషణ ఆరోగ్య జాతర కార్యక్రమం ..ముఖ్య అతిథిగా హాజరైన మంత్రులు సీతక్క,పొన్నం ప్రభాకర్ స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. కార్యక్రమంలో పాల్గొన్న శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి వాకటి కరుణ , డైరెక్టర్ క్రాంతి వెస్లి ,మహిళా సహకార అభివృద్ది సంస్థ చైర్మన్ బండ్రు శోభారాణి ,కలెక్టర్ ప్రమేల సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ , మున్సిపల్ కమిషనర్ ఛాహత్ భాజ్ పెయ్ యూనిసేఫ్ ప్రతినిధి జలాల్ మరియు ఇతర అధికారులు. పోషణ ఆరోగ్య జాతర సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్ లను సందర్శించిన మంత్రులు సీతక్క , పొన్నం ప్రభాకర్. స్టాల్ లలో పిల్లల పోషణ కు సంబంధించిన ఆహార పదార్థాలను రుచి చూసిన మంత్రులు ,అధికారులు. అక్కడే ఏర్పాటు చేసిన వైద్య శిబిరం పరిశీలన చేసి అనంతరం జరిగిన సభలో పాల్గొన్నారు.