తొర్రూర్ జడ్పీ హైస్కూల్ మైదానంలో భారీ ఎత్తున బతుకమ్మ సంబరాలు జరుపుకున్న విద్యార్థులు..
తొర్రూరు ప్రతినిధి: తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక బతుకమ్మ. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపి) తొర్రూరు శాఖ ఆధ్వర్యంలో స్థానిక జెడ్పీ హైస్కూల్ మైదానంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరిగింది.ఈ వేడుకల్లో పట్టణంలోని పలు పాఠశాలల,కళాశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి వచ్చి బతుకమ్మలను పేర్చి సంబురాలు చేయడం జరిగింది.ఈసందర్బంగా ఏబీవీపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గంగాధారి సిద్దు మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక బతుకమ్మ అని, బతుకమ్మ ఉత్సవాల్లో తెలంగాణ వ్యాప్తంగా ప్రతీ గ్రామంలో,ప్రతీ ఒక్కరూ ఎలాంటి తారతమ్యాలు లేకుండా చాలా ఉత్సాహంగా జరుపుకునే సాంప్రదాయం ఉంది అని తెలిపారు.నిజాం విముక్తి పోరాటంలో బతుకమ్మ ఉత్సవాలు ప్రజలకు పోరాట వేదికగా మారి సమైక్యంగా పోరాటం చేసేందుకు ఎంతో దోహదం చేసింది అని తెలిపారు.మలిదశ తెలంగాణ ఉద్యమం లో ప్రజలంతా కలిసికట్టుగా బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పై ఉద్యమించి స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు అని తెలిపారు.తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన ప్రతీ పోరాటం లో కీలక భూమిక పోషించిన బతుకమ్మ విశిష్టత ను నేటి తరం విద్యార్థిని,విద్యార్థులకు తెలియజేసేందుకు ఏబీవీపి ఈ బతుకమ్మ ఉత్సవాలను ఏర్పాటు చేస్తున్నదని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏబీవిపి పూర్వ రాష్ట్ర నాయకులు పల్లె కుమార్,పైండ్ల రాజేష్, కాగు నవీన్,రాజ్ కుమార్,సంతోష్,నూకల నవీన్, మహేష్,సాయి, గణేష్,రవి,విక్కి, సంతోష్, శ్రీనాథ్, మౌనిక,స్వప్న,మమత, అఖిల,పావని, నళిని నిఖిత తదితరులు పాల్గొన్నారు.