హనుమకొండ ప్రతినిధి: సెప్టెంబర్ 30 (పిసి డబ్ల్యూ న్యూస్) : ఐనవోలు లోని శ్రీ మల్లికార్జున స్వామి వారిని వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ పూజారులు ఎంపీ కి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. స్వామి వారికీ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి ఆశీర్వచనలు అందజేశారు. అనంతరం శాలువాతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆపేక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, ఆలయ ఈవో నాగేశ్వర్ రావు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.