మున్సిపాలిటీ వాహన మరమత్తుల (వెహికిల్ షెడ్)ను పరిశీలించిన ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి..
హనుమకొండ ప్రతినిధి: హనుమకొండలోని బాలసముద్రంలో ఉన్న మున్సిపాలిటీ వాహన మరమత్తుల (వెహికిల్ షెడ్), ట్రాంస్ఫర్ షెడ్ లను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మేయర్ గుండు సుధారాణి తో కలిసి పరిశీలించారు. మంగళవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో జరిగిన అంశాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే మరమ్మత్తుల కోసం ఆగి ఉన్న వాహనాలను ఎమ్మెల్యే పరిశీలించారు. చిన్న చిన్న వాహనాల ద్వారా సేకరించిన చెత్తను షెడ్ నుంచి భారీ వాహనాలకు తరలించే క్రమంలో పరిసర ప్రాంతాల ప్రజలకి ఇబ్బంది కలుగుతున్న తరుణంలో ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని ఎమ్మెల్యే అధికారులకు ఆదేశించారు. మరమ్మత్తుల కోసం ఉండే వాహనాలకు వీలైనంత త్వరగా మరమ్మతులు జరిపి విధులకు పంపించాలని కార్మికులకు తెలిపారు. సరైన రోడ్డు లేకపోవడంతో భారీ వాహనాలు ఆలస్యంగా వెళ్లడం పట్ల ట్రాన్సఫర్ స్టేషన్ లో సీసీ రోడ్డు నిర్మాణం ప్రది పాదనలో ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. డంపు యార్డ్ వెళ్లే మార్గంలో బాలసముద్రం పరిసర ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలుగుతుందని ప్రత్యామ్నాయ మార్గం కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. గత కొద్దీ రోజులుగా మరమ్మత్తుల్లో ఉన్న పోతన నగర్ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్ ప్రారంభానికి సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే నాయిని తెలిపారు. విధులకు హాజరుకాని డ్రైవర్, కార్మికుల పట్ల అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు, అధికారులు తదితరు పాల్గొన్నారు.