హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి జంక్షన్ అభివృద్ధికి 1.53 కోట్లు విడుదల చేసిన కుడా
హనుమకొండ ప్రతినిధి: ఎల్కతుర్తి జంక్షన్ అభివృద్ధికి. కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి పరిపాలన అనుమతుల పత్రాన్ని సెక్రటేరియట్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ కి అందించారు. ఎల్కతుర్తి జంక్షన్ వయా వరంగల్, సిద్దిపేట రహదారి కరీంనగర్ ని అనుసంధానం చేయడంలో ప్రధానమైనదని, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దృష్టికి తీసుకురావడం జరిగింది. అదే విధంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారు ఎల్కాతుర్తి జంక్షన్ ని నాలుగులైన్ రహదారిగా మార్చడంకోసం పనులు ప్రారంభించారు. మంత్రి పేర్కొన్న ఎల్కతుర్తి జంక్షన్ డెవలప్మెంట్, బ్యూటిఫికేషన్ కోసం, హన్మకొండ జిల్లా కలెక్టర్, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ సదరు రహదారిని సెప్టెంబర్ 12 నాడు సందర్శించి, ఎగ్జిక్యూటివ్స్ ఇంజనీర్ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ని పూర్తి నివేదిక సమర్పించమని ఆదేశించారు. సదరు ప్రాథమిక అంచనాల ఆధారంగా, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారు సమర్పించిన రూ. 1.53 కోట్లు “ఎల్కతుర్తి ట్రాఫిక్ జంక్షన్ అభివృద్ధి” కోసం విడుదల చేయడం జరిగింది.