Thursday, April 3, 2025

గిరిజన బాలికల వసతి గృహం ను సందర్శించిన మంత్రి…కలెక్టర్..

ములుగు జిల్లా సెప్టెంబర్ 25 (పీసీ డబ్ల్యూ న్యూస్) వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలి రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మరియు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క. హాస్టల్ల నిర్వహణ తీరుపై సంతృప్తి వెలిబుచ్చిన మంత్రి. బుదవారం ములుగు జిల్లా కేంద్రం లోని గడిగడ్డ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహం ను మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క భోజనం,వసత్తులు ఎలా వున్నాయి,అని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి, కలెక్టర్ విద్యార్థినిలతో కలసి అల్పాహారం చేశారు. అతిథిగా వచ్చి తమతో పాటు కింద కూర్చుని మంత్రి,కలెక్టర్ భోజనం చేయడంతో ఆ విద్యార్థినుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మెనూ ప్రకారం అల్పాహారం, మధ్యాహ్న భోజనం ఇస్తున్నారా? లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
హాస్టల్ల నిర్వహణపై తీరుపై సంతృప్తి వెలిబుచ్చిన మంత్రి. హాస్టల్లో ఉన్న ఖాళీ స్థలంలో షెడ్డును (డైనింగ్ హాల్) నిర్మిస్తే విద్యార్థినిలు అల్పాహారం, భోజనం చేసేందుకు అనువుగా ఉంటుందని దసరా సెలవుల్లో షెడ్ నిర్మించాలని మంత్రి తెలిపారు. అనంతరం మంత్రి ప్రక్కనున్న షెడ్యుల్ కులముల బాలికల వసతి గృహం ను సందర్శించారు. విద్యార్థులను పలుకరించి వారికి అందిస్తున్న భోజన, వసతి సదుపాయాలు, రోజువారీ దినచర్య గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏ టి డి ఓ దేశిరాం, జిల్లా షెడ్యూల్ కులాల అధికారి బానోత్ లక్ష్మణ్, డివి హెచ్ ఓ కొమురయ్య, డి డబ్లు ఓ ఇంచార్జీ శిరీష, డి పి ఓ దేవ్ రాజ్, ఎం.పి.డి. ఓ రామకృష్ణ, తహసిల్దార్ విజయ భాస్కర్, ఐ టి డి ఓ ఎస్ ఓ రాజ్ కుమార్ అనే, ఎంపి ఓ రహీం, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles