కల్లు గీత కార్మికులకు కాటమయ్య రక్షక కవచం పంపిణీ
సంగెం, ఆగస్టు 15( పీసీడబ్ల్యూ న్యూస్): తెలంగాణలో కల్లుగీత కార్మికులకు ” కాటమయ్య రక్ష కిట్ల” పంపిణీ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.ముందుగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో గీతకార్మికులకు సేఫ్టీ కిట్లను అందజేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు జిల్లాల వారిగా పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ పంపిణీ కార్యక్రమాన్ని వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ పరిధిలోని పలు మండలాలలో బుధవారం రోజు ప్రొ హిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ వర్ధన్నపేట,పర్వతగిరి,సంగెం మండలంలోని 25 మంది గీత కార్మికులకు మొదటి విడతగా కాటమయ్య రక్షా కిడ్స్ సంబంధించి అసిస్టెంట్ బిసి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి మూడు మండలాల గీత కార్మికులు హాజరైనారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న కాటమయ్య రక్ష కిట్లో 6 పరికరాలు ఉంటాయి. రోప్లు, క్లిప్లు, హ్యాండిల్స్, స్లింగ్ బ్యాగ్,లెగ్ లూప్స్ ఉంటాయి. ప్రస్తుతం గీత కార్మికులు ఉపయోగిస్తున్న మోకు తరహాలోనే సులువుగా తాళ్లు ఎక్కేందుకు ఈ కిట్టు సహాయపడుతుంది. ఈ కార్యక్రమంలో చల్లపల్లి నరసయ్య గౌడ్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఏం. స్వరూప, అసిస్టెంట్ బిసి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఈ శంకరయ్య ట్రీనర్ విష్ణు, రాకేష్ సిబ్బంది సిహెచ్ రమేష్ బాబు ఎం రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.