PCW News

Breaking
పురుగుల మందు తాగి వ్యక్తి మృతి *ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి*. రామడుగు పోలీస్ స్టేషన్ ను సందర్శించిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ జర్నలిస్టులకు మొండి చేయి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం -నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం -మాలమహానాడు జిల్లా కార్యదర్శి కూనమళ్ళ కమలాకర్ జీడీఎస్‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి.. ప్రతి మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం.. ఆనందోత్సాహాల నడుమ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. భూ కబ్జాదారుల నుండి 41 ఏళ్ల సమస్య.. రహదారుల పైన మత పరమయిన నిర్మాణాలు తొలగించాల్సిందే

టీ ఎస్ ఎస్ ఉద్యోగ సంఘం అధ్యక్షునిగా వాజిద్

హనుమకొండ: తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగ సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షునిగా వాజిద్ హుస్సేన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నగరంలోని పబ్లిక్ గార్డెన్ లోని నేరళ్ళ వేణుమాధవ్ కళా ప్రాంగణంలో శనివారం టి ఎస్ ఎస్ ఉద్యోగ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా షేక్ వాజిద్ హుస్సేన్ జాఫర్, ఉపాధ్యక్షులుగా పుల్ల వెంకన్న, ప్రధాన కార్యదర్శులుగా వాంకుడోత్ రమేష్, కార్యదర్శిగా యోగానందం, కోశాధికారిగా కొండ సారంగపాణి, ప్రచార కార్యదర్శిగా బూడిద సురేందర్, మహిళా ప్రతినిధిగా ఎండీ రజియా, కార్యవర్గ సభ్యులుగా గడ్డం కళావతి, పుట్ట జానకి, అంబాల జయ, బొంకూరి రాణి, బొంకురి ప్రభాకర్ లను ఎన్నుకున్నారు. ఈ సమావేశం లో ముఖ్య సలహాదారుడు డా. వెన్నెల శ్రీనాథ్, మారేపల్లి జాన్, గౌరవ అధ్యక్షులు దార దేవేందర్, టి ఎస్ ఎస్ కళాకారులు పాల్గొన్నారు. అధ్యక్షునిగా ఎన్నికైన వాజిద్ మాట్లాడుతూ సంఘం బలోపేతం చేసేందుకు కృషిచేస్తానని అన్నారు. తన ఎన్నికకు సహకరించిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటివల 30 శాతం పీఆర్సీ అమలుచేస్తు పెరిగిన జీతం ఖాతాల్లో జమ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు కృతజ్ఞతలు తెలిపారు.