Thursday, April 3, 2025

అక్రమ అరెస్టులకు భారతీయ జనతా పార్టీ భయపడదు. నిరుద్యోగుల సమస్యలపై దేనికైనా సిద్ధం అంటున్న బిజెపి,బిజెవైఎం మండల నాయకులు

సంగెం / జులై 20 (పీసీడబ్ల్యూ న్యూస్) భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర యూవ మోర్చా అధ్యక్షులు సెవెళ్ల మహేందర్ పిలుపు మేరకు టి జి పి ఎస్ సి నిరుద్యోగుల సమస్యలపై నిరుద్యోగ మహాధర్నా చౌక్ హైదరాబాద్ లో శనివారం రోజు మహ ధర్నా చేస్తారనే క్రమంలో ఉదయం నాలుగు గంటలకు బిజెపి నాయకులను సంగెం పోలీస్ బృందం ముందస్తు అరెస్టు చేయడం జరిగినది భారతీయ జనతా పార్టీ యూవ మోర్చా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో చేపట్టబోయే కార్యక్రమం లో

ఎనిమిది నేలల కాంగ్రెస్ పాలనలో
నిరుద్యోగ సమస్యలపై పోరాడితే అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయడం అన్యాయమని మండల బిజెపి ప్రధాన కార్యదర్శి భూక్య వెంకన్న బిజెవైఎం సంగెం మండల అధ్యక్షులు అవనగంటి సతీష్ అన్నారు. అరెస్టులు, కేసులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం బెదిరించడం, పోలీసులను ఉపయోగించి అరెస్టులు చేయించడం దుర్మార్గమని తెలిపారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
దీనిని మెము పిరికి పంధ చర్యగా భావిస్తున్నాము. నిరుద్యోగులు విధ్యార్థులు ఉద్యోగాల కోసం వారి తరుఫున మెము పోరాడుతుంటె పోలీసులతో అరేస్టు చేయడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీ అరెస్టులతో మా పోరాటాన్ని ఆపలేరు మీ
అరేస్టులకు భయపడె పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ.
రాబోయే రోజుల్లో మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.
అరెస్టు అయిన వారిలో భారతీయ జనతా పార్టీ సంగెం మండల ప్రధాన కార్యదర్శి భూక్యా వెంకన్న
బీజేవైఎం సంగెం మండల అధ్యక్షులు అవనిగంటి సతీష్ అనే ఇద్దరినీ అరెస్టు చేశారు.

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles