Wednesday, July 22, 2026

ఇంటర్ సెకండియర్ లో ఫెయిల్ కావడంతో మనస్థాపానికి గురై విద్యార్థిని ఆత్మహత్య

మహబూబాబాద్: ఇంటర్ సెకండియర్ లో ఫెయిల్ కావడంతో మనస్థాపానికి గురై ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కోరుకొండ పల్లి లో చోటుచేసుకుంది.. కోరుకొండ పల్లికి చెందిన జిలకర సునీత సురేష్ దంపతుల కుమారై అనురాధ (19) కల్వల మోడల్ స్కూల్లో ఇంటర్ చదువుతుంది.. ఇటీవల వెలువడించిన ఫలితాలలో ఫెయిల్ అయింది.. దీంతో గత నెల 28న ఇంట్లో ఉన్న ఎలుకల మందు తాగి ఆత్మహత్యకి పాల్పడింది.. మరుసటి రోజు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆమెను మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. వైద్యుల సూచన మేరకు ఈనెల వరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించిగా చికిత్స పొందుతూ అనురాధ మృతి చెందింది.. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Related Articles

Latest Articles