PCW News

Breaking
*ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి*. రామడుగు పోలీస్ స్టేషన్ ను సందర్శించిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ జర్నలిస్టులకు మొండి చేయి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం -నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం -మాలమహానాడు జిల్లా కార్యదర్శి కూనమళ్ళ కమలాకర్ జీడీఎస్‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి.. ప్రతి మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం.. ఆనందోత్సాహాల నడుమ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. భూ కబ్జాదారుల నుండి 41 ఏళ్ల సమస్య.. రహదారుల పైన మత పరమయిన నిర్మాణాలు తొలగించాల్సిందే FKK ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో భారత జట్టుకు రజత పథకం..

ఆర్టీసీ అధికారులు బస్సుల సంఖ్య పెంచాలి

పరకాల. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి ఫ్రీ బస్ పథకానికి భారీ స్పందన వస్తోంది. బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఏ బస్సులో చూసిన 70 శాతం వరకు మహిళలే కనిపిస్తున్నారు. పలు రూట్లలో బస్ సర్వీసులు సరిపోకపోవడంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఉచితంగా ప్రయాణించే వెసులుబాటును కొందరు మహిళలు దుర్వినియోగం చేస్తున్నారన్న వెల్లువెత్తుతున్నాయి. మహిళల సీట్లు నిండిపోవడంతో పురుషుల సీట్లలోనూ కూర్చుండడంతో పురుషులకు సీట్లు లేకుండా పోతున్నాయి. దీంతో వారు మేము టికెట్ కొనుగోలు చేసి బస్ ఎక్కిన మేము నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తుందని పురుష ప్రయాణికులు వాపోతున్నారు. అంతేకాకుండా సీట్ల కోసం పలుచోట్ల పంచాయితీలు కూడా జరుగుతున్నాయి. తాజాగా ఆర్టీసీ బస్సులో ఇద్దరు మహిళలు గొడవకు దిగారు. పండుగ సమయాల్లో మహిళలు అధిక సంఖ్యలో ప్రయాణాలు కొనసాగించారు. ఈ క్రమంలో సీటులో కూర్చునే విషయంలో ఇద్దరు మహిళల మధ్య ఘర్షణ మొదలైంది. ఇది పెరిగి పెద్దది కావడంతో ఒకరి జుట్టు మరొకరు పట్టుకొని కొట్టుకున్నారు. బస్సుల్లో దుర్భసలాడుకోవడం, కొట్టుకోవడం సర్వసాధారణం అయిపోయింది. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు బస్సుల సంఖ్య పెంచి, పురుషులు కూడా సగర్వంగా కూర్చుని ప్రయాణం చేసే విధంగా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.