Wednesday, July 22, 2026

రైలు క్రిందపడి బోనాల క్రిష్టయ్య ఆత్మహత్య

సంగెం. జూన్ 26 (పిసిడబ్ల్యూ న్యూస్): రైలు క్రింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగెం మండలంలొని ఎల్గుర్ రంగంపేట డౌన్ లైన్ ట్రాక్ వద్ద జరిగింది.బుధవారం రోజున రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని ఎల్గూర్ రంగంపేట గ్రామానికి చెందిన బోనాల కృష్ణయ్య (50)అనే వ్యక్తి ఇంటర్సిటీ రైలు కిందపడి మృతి చెందినట్లు తెలిపారు.మృతుడి భార్య బోనాల లక్ష్మి సంవత్సర క్రితం మృతి చెందింది.మృతునికి ఇద్దరు ఆడపిల్లలు మానస, మనోజ ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.కాగా క్రిష్టయ్య మృతి ఎల్గుర్ రంగంపేట గ్రామానికి తీరని లోటు అని స్థానిక ప్రజలు కన్నీటి పర్యంతమ్మయ్యారు.

Related Articles

Latest Articles