Saturday, March 7, 2026

పలుచోట్ల ఉన్న డ్రైనేజీ నిర్మాణం కోసం నాలాలను పరిశీలించిన కలెక్టర్ ప్రావిణ్య

పరకాల పురపాలక సంఘం పరిధిలోని పలుచోట్ల ఉన్న డ్రైనేజీ నిర్మాణం కోసం నాలాలను హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, అదనపు కలెక్టర్ రాధిక గుప్తా, ఇతర అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు.
పరకాల నుండి హుజురాబాద్ రోడ్ లోని బండ్ల బాట వద్ద డ్రైనేజీ నిర్మాణానికి సంబంధించిన సర్వే పనులను క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పరకాల ఆర్డీవో డాక్టర్ కె. నారాయణ, ఏసీపీ కిషోర్ కుమార్, పురపాలక సంఘం కమిషనర్ నరసింహ, సర్వే, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

Latest Articles