Saturday, April 5, 2025

ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల పునర్వైభవానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుంది

పరకాల, జూన్ 12 (పిసిడబ్ల్యూ న్యూస్): ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని బుధవారం పరకాల పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో హనుమకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్త తో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం పదవ తరగతి లో 9.5 పైగా గ్రెడ్ లో ఉత్తీర్ణులైన విద్యార్దులను అభినందిస్తూ బహుమతులు అందించారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, దుస్తువులు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఎంఎల్ఏ రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైన రోజున విద్యార్థులకు పుస్తకాలు, దుస్తువులు పంపిణీ చేయడం సంతోషకరమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యారంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టపోతున్నట్లు తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ఉపాధ్యాయులు చొరవ చూపించాలి ఆదేశించారు. ప్రతి తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించి వారు కూడా భాగస్వాములు అవ్వాలని కోరారు. ప్రభుత్వం విద్య రంగానికి పెద్దపీఠ వేస్తూ, మౌలిక సదుపాయాలను కల్పిస్తుందని అన్నారు. త్వరలో విద్యా కమిషన్, మెరుగైన సౌకర్యాల కల్పనకు అమ్మ ఆదర్శ కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. విద్యార్థులు ప్రైవేటు పాఠశాల విద్యార్థులతో పోటీపడి ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులై ప్రభుత్వ పాఠశాలలకు పేరు తేవాలను కోరారు.

 

 

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles