PCW News

Breaking
*ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి*. రామడుగు పోలీస్ స్టేషన్ ను సందర్శించిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ జర్నలిస్టులకు మొండి చేయి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం -నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం -మాలమహానాడు జిల్లా కార్యదర్శి కూనమళ్ళ కమలాకర్ జీడీఎస్‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి.. ప్రతి మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం.. ఆనందోత్సాహాల నడుమ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. భూ కబ్జాదారుల నుండి 41 ఏళ్ల సమస్య.. రహదారుల పైన మత పరమయిన నిర్మాణాలు తొలగించాల్సిందే FKK ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో భారత జట్టుకు రజత పథకం..

లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి -గొడవలు వద్దు-రాజీలు ముద్దు -వివాదాలు కావాలా…? రాజీలు కావాలా…? మీరే తేల్చుకోండి..

పరకాల, జూన్ 6 (పిసిడబ్ల్యూ న్యూస్): వివాదాలు అనేవి పెంచుకోవాలనుకుంటే జీవిత కాలం కొనసాగుతాయి…ఒక వేల ఇంతటితో పులిస్టాప్ పెట్టి కలిసుంటామని, ఒక నిర్ణయానికి వస్తే గొడవలు సమసిపోతాయి.. కావున తేదీ.06-06-2024 నుండి 08-06-2024 వ తారీఖు వరకు పరకాల కోర్టులో “నేషనల్ లోక్ అదాలత్” ఉంది కాబట్టి …మీ పై కానీ, మీకు తెలిసిన వాళ్ల పై గాని ఏమైనా కేసులు ఉంటే వాటిని కాంప్రమైజ్ చేసుకొని కోర్టుకు హాజరైనట్లయితే ఆ కేసులు పూర్తిగా క్లోజ్ చేయ బడునని, ఇందులో 1.యాక్సిడెంట్ కేసులు, 2.కొట్టుకున్న కేసులు 3.చీటింగ్ కేసుల కు సంబంధించిన కేసులు,4.వివాహ బంధానికి సంబంధించిన కేసులు, 5.చిన్న చిన్న దొంగ తనం కేసులు, 6.కరోనా అప్పుడు వేసిన నో మాస్క్ కేసులు ,డ్రంక్ అండ్ డ్రైవ్ ,ఓపెన్ డ్రింకింగ్ కేసులు, ఇతర రాజీ పడ దగు కేసులు, మొదలైనవని, ఈ నేషనల్ లోకదాలత్ లో కాంప్రమైజ్ చేసుకుని క్లోజ్ చేసుకోవచ్చు, కాబట్టి ఈ అవకాశాన్ని కేసు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోగలరు.. దీనికోసం ఫిర్యాదు దారుడు, నేరస్తులు అందరూ తమ యొక్క ఆధార్ కార్డు తీసుకుని పరకాల కోర్ట్ /పరకాల పోలీస్ స్టేషన్ కు రావాలని పరకాల పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.