మొండ్రాయి గొల్లపల్లె గ్రామానికి చెందిన దాసరి హర్షిత్.
సంగెం. జనగామ జిల్లా మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి దాసరి హర్షిత్ కరాటేలో ఎల్లో బెల్ట్ ను సాధించారు. ఈ విద్యార్థి వరంగల్ జిల్లా సంగెం మండలం మొండ్రాయి గొల్లపల్లె గ్రామానికి చెందిన దాసరి రవి కవిత దంపతుల కుమారుడు. బుధవారం రోజున ఉదయం హైదరాబాదులోని రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో బెల్ట్ టెస్ట్ టెస్ట్ టోర్నీ నిర్వహించడం జరిగింది ఈ టోర్నల్లో విద్యార్థుల్లో ప్రతిభ కనబరిచిన డి హర్షిత్ ఎల్లో సర్టిఫికెట్లు రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఫౌండర్ రవి చేతులమీదుగా బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ జనరల్ సెక్రెటరీ అన్నెపు రాజేంద్రం మాస్టర్ నారాయణ విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు, ఈ విద్యార్థిని విద్యార్థులను పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయులు కవిత, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు హర్షిత్ ను అభినందించారు.