గ్రూపు రాజకీయాలతో బలరాముడు గెలిచినా…?
మండల కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం కొందరు…!
ప్రభుత్వ పాలన ప్రచారం కోసం ఇంకొందరు…!
రెండు వర్గాలుగా చీలి కాంగ్రెస్ పార్టీ లో గ్రూపులు…!
బయ్యారం: గత అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పటిష్టత కోసం కాంగ్రెస్ పార్టీలో వివిధ పార్టీల నుండి వచ్చి ఆ పార్టీ తీర్థం పుచ్చుకొని ఇల్లెందు శాసనసభ్యులు కోరం కనకయ్య గెలుపు కోసం పాత,కొత్త రెండు గ్రూపులుగా విడిపోయి పనిచేస్తున్న పార్టీ పరిస్థితిని గమనించిన ప్రస్తుత ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం గ్రూపు రాజకీయాలు తమ ఓటు బ్యాంకుకు గండి పడుతుందని గ్రహించి ఓట్లు చీలకుండా ఎన్నోవ్యయ ప్రయాసలకు ఓర్చి వారందరినీ ఒక కలసి కట్టుగా ఉండే విధంగా,మండలం లో ప్రతి గ్రామంలో విస్తృత ప్రచారం చేసి తన గెలుపు కోసం పాత ,కొత్త వారిని సమన్వయం చేసి ఆ నాలుగు రోజుల పని చేయించి విజయం సాధించారు.ఆనాటి నుండి ఉప్పా-నిప్పా అన్న చందంగా బయ్యారం కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా చీలి నిత్యం అంతర్గత కలహాలతో పనిచేస్తున్నట్లు ఆ పార్టీ నుండి విమర్శలు వస్తున్నాయి.16 లోక్ సభ ఎన్నికల సందర్భంగా మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా పోరిక బలరాం నాయక్ పార్టీ అధిష్టానం టిక్కెట్ ఇచ్చినా ..మండల నేతల్లో ఎమ్మేల్యే వర్గం ఒకరు,పార్టీ జిల్లా అధ్యక్షుడి మరో వర్గం గా నిత్యం కుమ్ములాటలతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు బయట చర్చించు కోవడం పరిపాటిగా మారింది. ఈనెల 8 న, మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావ సభ ఏర్పాటు చేసి సమావేశం నకు వివిధ గ్రామాల నుండి వచ్చిన నేతలు,కార్యకర్తలు పార్టీ అభిమానులు సమావేశం ముగింపు వరకు ,మండల కాంగ్రెస్ నాయకుల సమన్వయ లోపంతో మీటింగ్ వచ్చిన జనం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రాక ముందే సభాస్థలి నుండి వెను తిరిగి వెళ్లి పోయారు.ఈ విషయం గమనించిన స్తానిక ఎమ్మేల్యే మండల నేతల అనైక్యత తో సభ విజయం కాకపోవటం ఓ కారణంగా బావించి కార్య కర్తలు వెళ్లే దారిలో స్వయంగా ఎమ్మేల్యే ,ఇతర మండల నేతలు వెళ్లి వారి ని బ్రతిమలాడి వారి వాహనాలలో సభా స్థలికి పంపించారు.
ఆదరా బాదరాగా జనం లేకున్నా మంత్రి ప్రసంగం : బయ్యారంలో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల సన్నాహక సమావేశం జనం వెళ్లి సభా ప్రాంగణం వెల వెల బోయిందని అక్కడికి వచ్చిన నేతలు కాసేపు చర్చించుకున్నారు.చివరి సమయంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేరుకొని తమ ప్రసంగం తో నేతల్లో అక్కడికి వచ్చిన ప్రజలలో జోష్ నింపి 5 నిమిషాలు ప్రసంగించి స్టేజిపై కుర్చీలో కూర్చోకుండా నే అక్కడినుండి వెనుదిరిగి వెళ్లిపోయారు.
గ్రూపు రాజకీయాలతో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గెలిచినా…?
మండల పార్టీ లో గ్రూపు రాజకీయాలు తారాస్థాయికి చేరి పోవడంతో నేతలు సమన్వయం లేక పోవడంతో ఇతర పార్టీలు బిఆర్ఎస్, బిజెపి కి ఓట్లు క్రాస్ అయ్యే అవకాశం ఉందనీ పలువురు అభిప్రాయ పడుతున్నారు.దీనితో మహబూబాబాద్ ఎంపి అభ్యర్థి పోరిక బలరాం గెలవడం అంత సునాయాసం కాదని తెలుస్తోంది.ఈ నెల13 ఎన్నికల పోలింగ్ శాతం,ఓటరు మనోగతం అన్ని కలిసి జూన్ 4 రిజల్ట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే…!