Wednesday, July 22, 2026

వరంగల్ బిఆర్ఎస్ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య 

హనుమకొండ ప్రతినిధి: ఏప్రిల్ 12 (పీసీడబ్ల్యూన్యూస్): సారత్విక ఎన్నికల్లో భాగంగా ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నాయి. తాజాగా టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ శుక్రవారం వరంగల్ బిఆర్ఎస్ అభ్యర్థిగా తాటికొండ రాజయ్యను  ప్రకటించారు. అయితే ఇంతకుముందు బి ఆర్ ఎస్ అభ్యర్థిగా కడియం కావ్య ఎంపిక చేయగా,  తాను బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయలేనని ప్రకటించి, అనూహ్యంగా తండ్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరి తో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరి, కాంగ్రెస్ టికెట్ దక్కించుకుంది. ఎన్నో తర్జనభర్జనల అనంతరం స్టేషన్గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను వరంగల్ బి ఆర్ ఎస్ అభ్యర్థిగా ఎంపిక చేసింది.

Related Articles

Latest Articles