Thursday, April 3, 2025

శ్రీశ్రీశ్రీ కోదండ రామచంద్రస్వామి దేవస్థానం జీర్ణోద్దరణ మహా కుంభాభిషేకం

బయ్యారం, ఏప్రిల్ 10(పిసిడబ్ల్యూ న్యూస్): మండల కేంద్రంలో శ్రీ కోదండ రామచంద్రస్వామి దేవస్థానం లో ఈనెల 15వ తేదీ నుండి 16వ తేదీ వరకు మహా కుంభాభిషేకం మరియు 17వ తేదీ శ్రీ సీతారామచంద్ర స్వామి వార్ల తిరు కళ్యాణ మహోత్సవం జరుగుతుందని దేవస్థాన అభివృద్ధి కమిటీ తెలిపింది.15వ,తేదీ సోమవారం ఉదయం 7-02 ని॥లకు మంగళ వాయిద్యములతో తోరణాలంకరణ, ఉదయం 8-00 గం॥లకు విఘ్నేశ్వర పూజ,పుణ్యాహవాచనం, పంచగవ్య మార్జన,పంచ గవ్య ప్రాశన,రక్షాబంధన,దీక్షా వస్త్ర ధారణ,అఖండ దీప స్థాపన, అంకురారోపణ,నవావరణయుత కళశ స్థాపన,మధ్యాహ్నం 3-00 గం॥లకు మహా చండీయాగం,నారాయణ యజ్ఞం, చండీ ఉపాసకులు 319 దేవాలయలలో విగ్రహా ప్రతిష్టలు చేసిన ప్రతిష్టాచార్య అవార్డు గ్రహిత బ్రహ్మాశ్రీ వేదమూర్తులు అవుధానుల మహదేవశర్మ చే సాయంత్రం 6-00 గం॥లకు ప్రదోషకాల పూజ,నీరాజన,మంత్ర పుష్పములు, చతుర్వేద స్వస్తి, ప్రసాద వినియోగం,16వ తేదీ మంగళవారం ఉదయం 5-04 ని॥లకు శ్రీ సీతా రామచంద్ర లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి వార్లకు పంచామృతాభిషేకం, అలంకరణ అర్చన ఉదయం 6-03 ని॥లకు మహా కుంభాబిషేకం,ఉదయం 9-30 ని॥లకు సుహాసిని లచే అమ్మవారి కుంకుమ పూజ, మధ్యాహ్నం 3-03 ని॥లకు పురుష సూక్త,శ్రీసూక్త, భూసూక్త,మన్యుసూక్త,సహిత శ్రీరామ,సీత,లక్ష్మణ,భరత, శతృఘ్న,ద్వారపాలక,శిఖర, ధ్వజ,మూలమంత్ర హోమములు,పూర్ణాహుతి, మహా విద్యాఉపాసకులు బ్ర॥శ్రీ॥వే॥ కొణకంచి సాయితరుణ్ శర్మ చే నిర్వహించ బడుతుందని తెలిపారు. సాయంత్రం 6-03 ని॥లకు మహా పుష్పాభిషేకం ప్రదోషకాల పూజ,నీరాజన, మంత్రపుష్పము,ప్రసాద వినియోగం,17వ తేదీ బుధవారం ఉదయం 8-03 ని॥లకు సీత రాముల వారిని పెళ్ళి కూతురు,కుమారుని చేయుట, ఉదయం 10-02 ని॥లకు సీతారామ చంద్రస్వామి వారి తిరు కళ్యాణోత్సవం నిర్వహించబడుతుందని దాని అనంతరం మధ్యాహ్నం 12-30 ని॥లకు నారాయణ సేవ ( అన్నప్రసాద వితరణ) మహా అన్నదాన కార్యక్రమం, సాయంత్రం 4-03 ని॥లకు గ్రామోత్సవం (ఊరేగింపు) నిర్వహించ బడుతుందని తెలిపారు.

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles