ఘనంగా బాబు జగజీవన్ రామ్ జయంతి
మేడ్చల్ -మల్కాజ్గిరి, కీసర మండలం దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ గృహ కల్ప కాలనిలో ఈ రోజు అణగారిన వర్గాల అభ్యుదయానికి అలుపుఎరుగని కృషి చేసిన సంఘ సంస్కర్త భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమనికి సభ అధ్యక్షులు డాక్టర్ గోల్లూరి రాజు వహించగా ముఖ్య అతిధులు కౌన్సిలర్స్ భూక్యా ననూనాయక్, నాగయ్య పల్లి సుజాత శ్రీనివాస్,కొత్త భాస్కర్ గౌడ్ ఇంక వివిధ పార్టీల నాయకులు బోడ నరేష్,ఈగ శ్వేతా రాజు ముదిరాజ్,గుజ్జుక నర్మదా పారశురాం, పాడుగుల రూప చంద్రమౌళి, కొక్కుల బిక్షపతి,రాజేంద్రప్రసాద్,బ్రమ్మం గౌతమ్, రాజా, నరేష్, కన్నయ్య, పంగ నర్సిమ్మ, పాండు,ఈశ్వర్, జిమ్ వెంకటేష్, సిరిసిల్ల శ్రీనివాస్, దుబాయ్ రాజు,కాలనీ వాసులు పాల్గొని జగజీవన్ రామ్ మరియు డాక్టర్ BR అంబేద్కర్ గార్లకు పూల మాలలు వేసి కార్యక్రమం విజయవంతం చేశారు.