Saturday, April 5, 2025

మానవత్వాన్ని చాటుకున్న సుల్తానాబాద్ ఎస్సై

పెద్దపల్లి జిల్లా, సుల్తానాబాద్ ఏప్రిల్ 5 (పిసిడబ్ల్యూ న్యూస్) : సుల్తానాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రావణ్ కుమార్ తన మానవత్వాన్ని చాటుకున్నారు.సమాజంలో పోలీసులు పాత్ర చాలా ముఖ్యమైనది.ఒకవైపు తన కుటుంబాన్ని చూసుకుంటూ,ప్రజలకు రక్షణ కల్పిస్తు,శాంతిభద్రతల పరిరక్షణే కాకుండా రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలను కూడా పరామర్శించి ఆదుకుంటున్నారు. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామ వాసి ఇటీవల రోడ్ ప్రమాదం లో మరణించిన తెలుకుంట్ల హన్సిక (17) కుటుంబాన్ని ఎస్సై శ్రవణ్ కుమార్ వారి ఇంటికి వెళ్లి పరామర్శించి వారి కుటుంబానికి 1 క్వింటాల్ బియ్యాన్ని అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి ఆదుకోవడం మానవ ధర్మం అని యువత కూడా వృధా ఖర్చులు పక్కన బెట్టి ఇలాంటి సేవ కార్యక్రమాలలో పాలుపంచుకోవాలని పిలుపు ఇచ్చారు.వీరి ఆర్థిక పరిస్థితి గురించి సమాచారం ఇచ్చిన తాళ్ళపల్లి అగయ్య ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మనోజ్ గౌడ్ ని ఎస్ఐ అభినందించారు. ఈ కార్యక్రమంలో మనోజ్ గౌడ్, ఆటో యూనియన్ సభ్యులు, స్థానిక యువత పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles