Thursday, April 3, 2025

పోలీసుల ఆధ్వర్యంలో జాగృతి కళా ప్రదర్శన

పరకాల ప్రతినిధి: (పీసీడబ్ల్యూ న్యూస్):వరంగల్ నగర పొలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా IPS  ఆదేశాల మేరకు రాత్రి 7:30 గంటల నుండి రాత్రి 9:40 గంటల వరకు పర్కాల పోలీస్ స్టేషన్ పరిధిలోని పోచారం గ్రామంలో జాగృతి పోలీస్ కళా బృందం, చదువు,రోడ్డు ప్రమాదాలు, డయల్100,సైబర్ క్రైమ్స్ నాటిక ద్వారా ప్రదర్శిస్తు1930 సైబర్ టోల్ నంబర్ గురించి వివరించారు. బాల్య వివాహల నిర్మూలనపై అవగాహన కల్పించారు. అదేవిధంగా గుట్క,గంజాయి డ్రగ్స్ వల్ల యువకులు వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని, మూఢ నమ్మకాలను నమ్మవద్దని ప్రదర్శన ద్వారా మ్యాజిక్ షో చేసి చూపించారు., వృద్ధాప్యంలో ఉన్న తల్లి, తండ్రులను మంచిగ చూసుకోవాలన్నారు. ప్రశాంత వాతావరణoలో ఎన్నికలు జరుపుకోవాలని ఎటువంటి గొడవలు పెట్టుకోవద్దని పాటల ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో పర్కాల సిఐ రవిరాజు, పోలీస్ కళాబృందం ఇంచార్జి ఉమెన్ ఎ ఎస్ఐ నాగమణి, సభ్యులు, హెచ్ సి విలియమ్, కానిస్టేబుల్ రత్నయ్య, హెచ్ జి ఎస్, శ్రీనివాస్, నారాయణ, విక్రమ్రాజ్, చిరంజీవి, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles