టేకుమట్ల, ఏప్రిల్ 4 (పిసిడబ్ల్యూ న్యూస్): సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా టేకుమట్ల పోలీస్ సిబ్బంది చొరవ తీసుకొని ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తికి టేకుమట్ల ఎస్సై ప్రసాద్ మొబైల్ ఫోన్ అప్పగించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం ఆశీరెడ్డిపల్లె గ్రామానికి చెందిన మేడిపల్లి రమేష్ తన కుమారునడిని టేకుమట్ల బస్టాండులో దించడానికి వెళ్లగా అతని యొక్క ఫోన్ పోవడంతో అతను పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన పోలీసులు సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా ట్రేస్ అవుట్ చేసి అతని మొబైల్ ఫోను బాధితుడికి టేకుమట్ల ఎస్ఐ ప్రసాద్, సిబ్బంది అప్పగించారు. వెంటనే పోలీసులు ఫిర్యాదు పై స్పందించినందుకు పోలీస్ సిబ్బందికి బాధితుడు కృతజ్ఞతలు తెలియజేశారు.