టేకుమట్ల, ఏప్రిల్ 3 (పిసి డబ్ల్యూన్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం రాఘవపూర్ గ్రామానికి చెందిన జొన్నల వ్యొమ్ టేకుమట్ల శాంతినికేతన్ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థి ఇటీవల జరిగిన నవోదయ ప్రవేశ పరీక్షలో సీటు సాధించినందుకు టేకుమట్ల ఎస్సై ప్రసాద్ ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హరీష్ కుమార్ కు, విద్యార్థి కి అభినందనలు తెలియజేశారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ రాబోయే తరాలకు ఇలాంటి విద్యార్థులను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే ఒకే ఒక ఉన్నతమైన వ్యక్తి ఉపాధ్యాయుడే కాబట్టి రాబోయే రోజుల్లో ప్రణాళిక బద్దంగా బోధిస్తూ ఇలాంటి విద్యార్థులను తయారు చేయాలని ఉపాధ్యాయ బృందానికి,తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై తో పాటు సిబ్బంది కానిస్టేబుల్ మధుకర్ ,రంజిత, స్వప్న, రాజయ్య ,గంగరాజులు పాల్గొని ఆ విద్యార్థికి శుభాకాంక్షలు తెలియజేశారు.