Thursday, April 3, 2025

దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

పరకాల, మార్చి 31 (పిసిడబ్ల్యూ న్యూస్): ఇతర రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు సీఐ రవిరాజు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. పరకాల బస్టాండ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు కనబడగా వారిని పట్టుకుని విచారించగా వారు ఒడిస్సా రాష్ట్రానికి చెందిన వ్యక్తులని, వారు కూలి పని కోసం తెలంగాణ వచ్చి వరంగల్ లో దిగి వరంగల్ నుండి భూపాలపల్లి మీదుగా కాళేశ్వరం వైపు వెళుతుండగా పరకాలలో దిగి పరకాలలో పని కోసం అక్కడక్కడ తిరిగేసరికి వారి భోజనాలకు చార్జీలకు డబ్బులు అయిపోయేసరికి వారు ఏదైనా దొంగతనం చేద్దామని నిర్ణయించుకొని, పరకాల బస్టాండ్ లో భూపాల్ పల్లి ఎక్కే బస్సు వద్ద రద్దీ జనం ఉండడంతో అక్కడికి వెళ్లి ప్రయాణికుల జేబులోల నుండి రెండు సెల్ ఫోన్లను దొంగిలించారని, మరలా అదే గ్రామంలో ఆదివారం పరకాల బస్టాండ్ కు వస్తుండగా.. పోలీసులు వారిని పట్టుకొని విచారించగా.. వారి పేర్లు 1) ఆకాష్ ప్రధాన్ తండ్రి టిక్కా ప్రధాన్ వయసు(20) కులం ఎరుకల,వృత్తి కూలి ఒడిస్సా రాష్ట్రం, 2) సమీర్ ప్రధాన్ తండ్రి శీను ప్రధాన్ వయసు (18) కులం ఎరుకల వృత్తి కూలి ఒడిస్సా రాష్ట్రం అని, వారి వద్ద నుండి రూ. 20 వేల విలువగల సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా దొంగలను వి పట్టుకున్న ఎస్సై రమేష్ , కానిస్టేబుల్ నాగరాజు, హెచ్ జి సుధాకర్ ల ను పరకాల సీఐ రవిరాజు అభినందించారు.

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles