బి.ఆర్.ఎస్.లో చేరిన మోరే రాజేందర్
పరకాల పట్టణంలోని 5వ డివిజన్ కి చెందిన మోరె రాజేందర్ కాంగ్రెస్ పార్టీని వీడి పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో తిరిగి బి.ఆర్.ఎస్.లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి చల్లా ధర్మారెడ్డి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన రాజేందర్ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి ఆ పార్టీలో చేరి తప్పుచేసానన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు,పాలన నచ్చకనే తిరిగి బి.ఆర్.ఎస్ లో చేరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బి.ఆర్.ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.