వరంగల్ ఎంపీ పోటీ నుంచి విరమించుకున్న బిఆర్ఎస్ అభ్యర్థి కడియం కావ్య
వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు బిఆర్ఎస్ అభ్యర్థి కడియం కావ్య ఒక ప్రకటనలో తెలిపారు. మే 13, 2024 నాడు జరిగే లోకసభ ఎన్నికలలో వరంగల్ లోకసభ స్థానం నుండి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిన మీకు ధన్యవాదములు. అయితే గత కొన్ని రోజులుగా పార్టీ నాయకత్వంపై మీడియాలో వస్తున్న అవినీతి, భూకబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ లాంటి వ్యవహారాలు, లిక్కర్ స్కాం లాంటి విషయాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయి. జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేకపోవడం, ఎవరికీ వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించడం పార్టీకి మరింత నష్టం చేస్తున్నందున, ఈ పరిస్థితులలో నేను పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నాను. కె.సి.ఆర్, పార్టీ నాయకత్వం, బిఆర్ఎస్ కార్యకర్తలు నన్ను మన్నించ వలసిందిగా కోరుతున్నాను.