నిరుద్యోగులపై టెట్ ఫీజు భారం
పరకాల, మార్చి 24 (పిసిడబ్ల్యూ న్యూస్): రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న టెట్ పరీక్షా ఫీజును తగ్గించాలని పరకాల మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు ముఫీనా ఫాతిమా హమీద్ డిమాండ్ చేశారు. ఎంతో ఆశతో ఎదురు చూసిన నిరుద్యోగ యువతకు ప్రభుత్వం అధిక ఫీజును పెంచి నిరుత్సాహనికి గురిచేసిందన్నారు. గతంలో టెట్ పరీక్ష ఫీజు ఒక పేపర్ కు 200, రెండు పేపర్లకు 300 చొప్పున ఉండేదని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఒక పేపర్ కు 1000, రెండు పేపర్లకు 2000 లకు పెంచడం వలన అన్ని కులాల పేద నిరుద్యోగులు ఆందోళనకు గురవుతున్నారని, తక్షణమే ప్రభుత్వం చొరవ చూపి టెట్ పరీక్షా ఫీజును తగ్గించాలని కోరారు.