చలో సికింద్రాబాద్” మహిళా సదస్సుకు బయలుదేరిన సంగెం మండల మహిళా సంఘ సభ్యులు, వివోలు.
సంగెం: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న గ్రామీణ పేదరిక నిర్మూల సంస్థ డి. ఆర్ డి ఏ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో మహిళా సంఘ సభ్యులు,వివోలు,మంగళవారం రోజున సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లోలో మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న మహిళా సదస్సు కార్యక్రమానికి సంగెం మండల మహిళా సంఘ సభ్యులు, వివోలు సిఏలతో పాటు మొండ్రాయి గ్రామానికి చెందిన మహిళ సంఘ సభ్యులు వివోలు పెద్ద ఎత్తున బయలుదేరారు.అనంతరం స్థానిక మాజీ సర్పంచ్ గుడా కుమారస్వామి జెండా ఊపి ప్రారంబించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రవీందర్,ఏపిఎం కిషన్,సిఏలు,వివోలు,ఎంపిటిసి కొనుకటి రాణి మొగిలి,కాంగ్రెస్ జిల్లా కమిటీ సభ్యులు చెవ్వ మొగిలి,సంగెం మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మడత కేశవులు,గ్రామ వర్కింగ్ ప్రెసిడెంట్ పరికి యాకయ్య,నీరటి కుమారస్వామి,అనుముల కుమారస్వామి,పాక శీను,మహిళా సంఘ సభ్యులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.