Thursday, April 3, 2025

మొండ్రాయి శివాలయ భూమిని కబ్జాదారుల నుండి కాపాడాలి

సంగెం, మార్చి7 (పిసిడబ్ల్యూ న్యూస్): సంగెం మండలం మొండ్రాయి గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్(రెవిన్యూ) సంధ్యా రాణి ని కలిసి గ్రామంలో 1200 సంవత్సారాల క్రితం ఉన్న శివాలయాన్ని పునర్నిర్మాణంలో భాగంగా నిర్మాణ పనులు చేస్తున్న క్రమంలో కమిటీ సభ్యులను కబ్జాదారుడు వీరగోని రమేశ్ దంపతులు, తాల్లపెల్లి యశోద లు ఇష్టం వచ్చినట్లు కమిటీ సభ్యులను తిడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎమ్మార్వో రాజ్ కుమార్ , ఆర్డిఓ ఆఫీసర్ కు వినతి పత్రం అందించారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి శాలువతో సత్కరించి పుష్పగుచ్చoతో వినతి పత్రం అందించడం జరిగినది. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సానుకూలంగా స్పందించి గుడి స్థలం విషయంలో వెంటనే ఆర్డిఓ ఆఫీసర్, మండల తాసిల్దార్ కి ఫోన్ చేసి తక్షణమే చర్యలు చేపట్టి గుడి స్థలాన్ని రక్షించాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి కి ఎమ్మెల్యే ఆదేశించడం జరిగింది. గుడి స్థలం విషయంలో ప్రైవేటు వ్యక్తులు ఎవరు అడ్డు వచ్చినా చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.ఈ వినతి పత్రాన్ని అదనపు కలెక్టర్ కు అందించి తమ అవేదన వ్యక్తం చేశారు.త్వరగా శివాలయ భూమిని కబ్జాదారుల నుండి రక్షించి గ్రామ ప్రజల చిరకాల కోరిక అయిన శివాలయ నిర్మానం జరిగేటట్లు ఉత్తర్వులు జారీ చేయాలని కలెక్టర్ ను కొరారు. అదనపు కలెక్టర్ సంధ్య రాణి మాట్లాడుతూ…త్వరలో మొండ్రాయి గ్రామాన్ని సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకొని గుడి నిర్మాణానికి చేపట్టవలసిన చర్యల గురించి నిర్ణయం, కబ్జాదారులపై కఠీన చర్యలు తీసుకుంటానని చెప్పినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ చెవ్వ మొగిలి,ఉపాధ్యక్షులు కడుదురి సంపత్,పరికి యాకయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్స్ కక్కెర్ల వీరస్వామి,మడత కేశవులు,ప్రధాన కార్యదర్శి పెండ్లి పురుషోత్తం రెడ్డి, కార్యదర్శి చెవ్వ బాలకృష్ణ,కోశాధికారి పెండ్లి రమేశ్, సహాయ కోశాధికారి కొనకటి కమలాకర్,ప్రచార కార్యదర్శిలు వేల్పుల కుమారస్వామి,పొన్నాల హరీష్,గూడ రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles