Friday, April 4, 2025

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల గోడ పత్రికల ఆవిష్కరణ –ఎంపీపీ కందగట్ల కళావతి

సంగెం, మార్చ్ 5 (పిసిడబ్ల్యూ న్యూస్): సంగెం మండలం సంఘమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల గోడ పత్రికలను ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఎంపీపీ కందగట్ల కళావతి ఆవిష్కరించినారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఛైర్మన్ కందగట్ల నరహరి మాట్లాడుతూ…. సంగెం మండల కేంద్రంలోని సంఘమేశ్వర ఆలయంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను ఈనెల 5 నుండి 8 తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నామని, మార్చి 8 మహాశివరాత్రి రోజున రాత్రి 1:03నిమిషాలకు శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. కావున మండలంలోని అన్ని గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మహా శివుని కృప, ఆశీస్సులు పొందాలని, ఆలయ ప్రాంగణంలో రాత్రి సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని వాటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మల్లయ్య, కమిటీ ప్రధాన కార్యదర్శి అగపాటి రాజు, ఉపాధ్యక్షులు మునుకుంట్ల కోటేశ్వర్, కక్కర్ల శరత్ , గుండేటి రాజకుమార్ ,కమిటీ సభ్యులు గుండేటి బాబు, మెట్టిపల్లి రమేష్, కోడూరి సదయ్య, పులి వీరస్వామి, పులి సాంబయ్య, అప్పే నాగార్జున శర్మ, నల్లతీగల రవి, అప్పాల కవిత, గుండేటి లవకుమార్, ఇప్పకాయల మనోహర్, పేరాల లక్ష్మీనర్సయ్య, గుండేటి చిన్ని, గుండేటి సునీల్, మెట్టిపల్లి సునీల్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles