కళ్యాణ మహోత్సవ పోస్టర్ ఆవిష్కరణ
చిట్యాల, మార్చి 5(పిసిడబ్ల్యూ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఒడితల గ్రామంలోని కాకతీయుల నాటి నిర్మాణ దేవాలయం. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం లో మహాశివరాత్రి సందర్భంగా జరగబోయే కళ్యాణ మహోత్సవా పోస్టర్ ను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా క్యాంప్ కార్యాలయం లో మంగళవారం ఆలయ కమిటీ చైర్మన్ కత్తి సతీష్ గౌడ్ , డైరెక్టర్స్ గట్టు రాజు, పసునూటి రాజేందర్, దేవరకొండ రాజబాబు, కాంపెల్లి శారదా, కాంగ్రెస్ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి లతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండి భగవాన్ , ఎర్రబెల్లి భద్రయ్య , పట్టెం శంకర్ , కందల సరూప , స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.