PCW News

Breaking
*ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి*. రామడుగు పోలీస్ స్టేషన్ ను సందర్శించిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ జర్నలిస్టులకు మొండి చేయి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం -నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం -మాలమహానాడు జిల్లా కార్యదర్శి కూనమళ్ళ కమలాకర్ జీడీఎస్‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి.. ప్రతి మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం.. ఆనందోత్సాహాల నడుమ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. భూ కబ్జాదారుల నుండి 41 ఏళ్ల సమస్య.. రహదారుల పైన మత పరమయిన నిర్మాణాలు తొలగించాల్సిందే FKK ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో భారత జట్టుకు రజత పథకం..

బాలవికాస ఆధ్వర్యంలో ఉచిత కుట్టుమిషన్ శిక్షణ తరగతులను ప్రారంభించిన టి జి పి ఏ రాష్ట్ర అధ్యక్షులు అంబాల ప్రభు

జమ్మికుంట, మార్చి 5 (పిసుడబ్ల్యూ న్యూస్): బాలవికాస సభ్యులలో కుట్టు మిషన్ వచ్చిన వారిలో ప్రత్యేక శిక్షణ ద్వారా మరిన్ని మెలుకువలు నేర్పడం కోసం మంగళవారం యూనియన్ బ్యాంక్ పైన టీజీపీఏ రాష్ట్ర అధ్యక్షులు అంబాల ప్రభాకర్ ప్రభు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోనీ జమ్మికుంట వీణవంక ఇల్లంతకుంట మండలాలలో బాలవికాస సంస్థ సభ్యురాళ్లకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా 15 మంది మహిళలకు కుట్టు మిషన్ వచ్చిన వారిని ఎంపిక చేసి 42 వేల రూపాయల విలువ చేసే కుట్టు మిషన్ ఒక్కొక్క సభ్యురాలు 15 వేల రూపాయలు బాల వికాస సంస్థ ద్వారా చెల్లిస్తే మిగతా 27 వేల రూపాయలు ఉషా కంపెనీ సహకారం లబ్దదారులకు అందజేసి శిక్షణను ప్రారంబిచారు. ఇట్టి శిక్షణ 21 రోజుల పాటు ఉంటుందని బాల వికాస సంస్థ ఫీల్డ్ కో ఆర్డినేటర్ అమూల్య తెలిపారు. సందర్భంగా అంబాల ప్రభు కుట్టుమిషన్ నేర్చుకునే బాల వికాస సంస్థ సభ్యులందరూ ఉచిత శిక్షణను వినియోగించుకొని నేటి సమాజానికి అనుగుణంగా మెలుకుల నేర్చుకుని ఆర్థిక అభివృద్ధి చెందుతూ సమాజంలో ఆదర్శంగా నిలవాలి కోరారు. అదే విధంగా బాల వికాస సంస్థ ఎన్ని సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయం అని, అందరు బాల వికాస సంస్థ ను ఆదరిస్తూ అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాల వికాస జమ్మికుంట సెంటర్ మేనేజర్ సులోచన, ఇన్స్తక్టర్ లావణ్యకు పాల్గొన్నారు.