ఈనెల 6 నుంచి పగిడిద్దరాజు మహా జాతర మేడారం గద్దెల ప్రాంగణంలో పోస్టర్ల ఆవిష్కరణ మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అర్రెం లచ్చు పటేల్
ములుగు, మార్చి 5 (పీసిడబ్ల్యూ న్యూస్): తాడ్వాయి మండల కేంద్రంలో ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర శ్రీ మేడారం సమ్మక్క భర్త అయినా పగిడిద్దరాజు తిరుగు జాతర ఈనెల 6, 7, 8, 9 తేదీలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం యాపలగడ్డ గ్రామంలోని పగిడిద్దరాజు ఆలయంలో ఘనంగా నిర్వహించనున్నట్లు మేడారం ట్రస్ట్ బోర్డు ఉత్సవ కమిటీ చైర్మన్ అర్రెం వంశీయులు లచ్చు పటేల్ తెలిపారు ఈ సందర్భంగా సోమవారం మేడారం గద్దెల ప్రాంగణంలో పగిడిద్దరాజు మహా జాతర పోస్టర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా అర్రెం లచ్చు పటేల్ మాట్లాడుతూ ఆదివాసీల ఆరాధ్య దైవం సమ్మక్క భర్త అయినా పగిడిద్దరాజు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మేడారంలో జరుగు సమ్మక్క సారలమ్మ మహా జాతరకి మేడారంలో సమ్మక్కతో వివాహం జరిగిన జాతర అనంతరం యాపల గడ్డ గ్రామంలో నాగవెల్లి జాతర మూడు రోజులు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటిరోజు 6వ తారీకు బుధవారం ఉపవాసం గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి సాయంత్రం గుట్ట నుంచి దేవుడిని వనం తెచ్చుట 2వ రోజు ఏడవ తారీఖు గురువారం స్వామివారిని అమ్మవారిని గంగసానం చేయించి ఊరేగింపు చేయడం జరుగుతుంది మూడవరోజు యాపల గడ్డలో జరుగు పగిడిద్దరాజు జాతరను భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మేడారం ట్రస్ట్ బోర్డ్ ఉత్సవ కమిటీ చైర్మన్ అర్రెం లచ్చు పటేల్ తాడ్వాయి మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్ దొర సమ్మక్క ప్రధాన పూజారి సిద్ధబోయిన స్వామి రమేష్ రాజు ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొప్పుల రవి సోలం నందు చింత సతీష్ ఈక రాజేష్ తదితరులు పాల్గొన్నారు