Thursday, April 3, 2025

పోలియో చుక్కలు పిల్లలకు వేయించాలి – ఎంపీపీ కందగట్ల కళావతి నరహరి

సంగెం, మార్చి 03(పిసిడబ్ల్యూ న్యూస్): దేశవ్యాప్తంగా ఇవాళ పల్స్ పోలియో నిర్వహిస్తున్నారు. పోలియో రాకుండా పిల్లలకు చుక్కల మందు వేయిస్తున్నారు. పోలియో చుక్కల మందు కార్యక్రమాన్ని సంగెం మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ కందగట్ల కళావతి నరహరి హాజరై చిన్నారులకు పోలియో చుక్కల మందు వేసి ఆమె మాట్లాడుతూ…పిల్లలకు వచ్చే అనేక వ్యాధుల్లో పోలియో ఒకటి. ఇది వస్తే, పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గి, కాళ్లు, చేతులూ వంకర అవుతాయి. కొన్ని కేసుల్లో మెదడుకి కూడా వ్యాపిస్తోంది. ఇలా అవయవాలకు వైకల్యం సంభవిస్తుంది. ఇది అంటువ్యాధి కాదు. దీన్ని రాకుండా చెయ్యడానికి సింపుల్ ప్రాసెస్ ఉంది. అదే చుక్కల మందు. ఈ మందును ఇప్పుడే పుట్టిన పిల్లల నుండి 5 ఏళ్ల వయసు లోపు పిల్లలకు ఏటా ఒక రోజు ఉచితంగా వేస్తారు. అది ఈ రోజే. ఇవాళ ఆదివారం కాబట్టి.. దేశవ్యాప్తంగా పల్స్ పోలియో నిర్వహిస్తున్నారు. ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు ప్రతి ఒక్కరు పోలియో చుక్కలు వేయించాలని, పిల్లల ఆరోగ్య విషయంలో తల్లితండ్రులు జాగ్రత్తలు పాటించాలని, పోలియో రహిత సమాజ స్థాపనకు కృషి చేయాలని అన్నారు. ఉదయం 7 గంటలకు మొదలై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని ఆమె తెలిపారు. సంగెం మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు తమ పిల్లలకు తప్పనిసరి పోలియో చుక్కలు వేయించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సంగెం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ .ఉదయ్ ఎంపీటీసీ మెట్టిపల్లి మల్లయ్య, మాజీ సర్పంచులు, కందగట్ల నరహరి,గుండేటి బాబు,మెట్టిపల్లి రమేష్,ఆగపాటి రాజు, మునుకుంట్ల మోహన్ ,అప్పాలకవిత,నల్లతీగల రవి, ఆశాలు కోతి కవిత, మెట్టిపల్లి సుమలత,మెట్టిపల్లి కళ్యాణి పోల్గొన్నారు.

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles